మదనపల్లె అర్బన్ : ఈ నెల 19వ తేదీ మదనపల్లి మిషన్ కాంపౌండ్‌లో జరగ బోవు బహుజన రాజ్యాధికార సభకు సంబంధించిన ప్రచార రథాలు బిఎస్‌పి రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతం కుమార్ మరియు బిఎస్‌పి సీనియర్ నాయకులు ప్రారంభించడం జరిగింది. ఈ సందఠంగా నాయకులు మాట్లాడుతూ బహుజన రాజ్యాధికార సభకు బిఎస్‌పి రాజ్యసభ సభ్యులు రాంజీ గౌతమ్, డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్, బి.పరంజ్యోతి, బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షులు విచ్చేస్తున్నారని తెలిపారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం కొన్ని వర్గాల చేతుల్లోనే అధికారం పెట్టుకుని బహుజన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అధికారం అందనీయకుండా కేవలం పెత్తందార్లు మాత్రమే పెత్తనం చేస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఓట్లగా మాత్రమే చూసే ఈ మనువాద దోపిడీ రాజకీయ పార్టీలు లాగా కాకుండా బహుజనులను రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసే పార్టీ ఈ దేశంలో బహుజన సమాజ్ పార్టీ ఒక్కటే అని తెలిపారు. కనుక బహుజన ప్రజలంతా ఈ మనువాద అగ్రకుల దోపిడీ రాజకీయ పార్టీలు ఎదుర్కొని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోవు బహుజన రాజ్యాధికార సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బిఎస్‌పి సీనియర్ నాయకులు రెడ్డప్ప, బురుజు లక్ష్మీనారాయణ, సహదేవ, రమణ శ్యామ్, బాలాజీ పాల్గొన్నారు.










