కమిషనర్ పరిశీలిన్
బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తే జరిమానా
- కమిషనర్ వికాస్ మర్మత్, ఐ.ఏ.ఎస్
నెల్లూరు :క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యాచరణలో భాగంగా నెల్లూరు నగర పాలక సంస్థ ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్న డోర్ టు డోర్ చెత్త సేకరణకు ప్రజలంతా సహకరించాలని, బహిరంగంగా వ్యర్ధాలు వేస్తే వీధిలోని స్థానికులందరికీ జరిమానాలు విధిస్తామని కమిషనర్ కమిషనర్ వికాస్ మర్మత్ హెచ్చరించారు. బుధవారం స్థానిక 7 వ డివిజను తోట బడి, 8వ డివిజను తడికెల బజారు ప్రాంతాల్లోని శానిటేషన్ మస్టర్ పాయింట్ ను కమిషనర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని శానిటేషన్ సిబ్బంది హాజరును కమిషనర్ పరిశీలించారు. ముందస్తు అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరు అయ్యే సిబ్బందికి షో కాజ్ నోటీసులు జారీ చేయాలని, నోటీసులకు జవాబు ఇవ్వని సిబ్బందిని విధుల నుంచి తొలగించాలని ఎమ్.హెచ్.ఓ ను ఆదేశించారు. మెడికల్ సెలవుల మంజూరుకై అధికారిక మెడికల్ బోర్డు ఆసుపత్రుల సర్టిఫికెట్ లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అనంతరం 7/1 వ డివిజన్ సచివాలయం పరిధిలో ఎస్.వి.ఎస్ కల్యాణ మండపం సమీపంలో వీధిలో పేరుకున్న చెత్తను గమనించిన కమిషనర్ స్థానిక ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయరాదని హెచ్చరించారు. అదేవిధంగా చెత్త సేకరణ యూజర్ చార్జీలు 90 నుంచి 40 రూపాయలకు తగ్గించినందున ప్రతిఒక్కరూ బాధ్యతగా చెల్లించాలని కోరారు. యూజర్ చార్జీల చెల్లింపుకై శనివారం నాడు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నామని, నగర పాలక సంస్థ పరిధిలోని 54 డివిజనుల ప్రజలు బాధ్యతగా చెల్లించాలని కమిషనర్ కోరారు. ప్రత్యేక డ్రైవ్ ను కమిషనర్ స్వయంగా సందర్శించి యూజర్ చార్జీల చెల్లింపులను పర్యవేక్షిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, సూపర్వైజర్లు, సచివాలయం శానిటేషన్ కార్యదర్శులు పాల్గొన్నారు.










