Apr 08,2022 20:14

కేరళ : బెంగాల్‌కు చెందిన దీప్సితా దర్‌ ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ కార్యదర్శి. డిల్లీలోని జెఎన్‌యులో పరిశోధక విద్యార్థి. సిపిఎం మహాసభలకు తొలిసారిగా హాజరైన దీప్సిత .. మలయాళంలో పాట పాడి అందరి ప్రశంసలూ అందుకొంది. 'మేం పంటలు పండిస్తాం, ఆ పొలాలు మావే, అరుణారుణ పతాకం మాదే మాదే' అనే అర్థం వచ్చే మలయాళ గీతాన్ని అద్భుతంగా ఆలాపించగా, ప్రతినిధులు కరతాళ ధ్వానాలు చేశారు. ఆ తరువాత దీప్సిత మాట్లాడుతూ... ''కేరళను నా ప్రియమైన భూమిగా భావిస్తాను. ఇక్కడి అలవాట్లు, సంస్క ృతి నన్ను తనలో మమేకం చేసుకునే నేల ఇది.'' అని పేర్కొంది. గల్ఫ్‌ వలసలపై తన పరిశోధన, ఉద్యమ అవసరాల నిమిత్తం ఇప్పటికే ఐదుసార్లు కేరళను సందర్శించింది. జెఎన్‌యులోని తన కేరళ ఉద్యమ మిత్రుల ద్వారా మలయాళ అభ్యుదయ గీతాలను పాడటం నేర్చుకొంది. ఎస్‌ఎఫ్‌ఐ కార్యక్రమాల్లో తాను పాడిన 'ఆజాదీ', 'నమ్మాలు కోయుం వాయలెల్లం' పాటలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. దీప్సిత తండ్రి పిజూష్‌ దార్‌ కూడా ఈ మహాసభలో ప్రతినిధిగా పాల్గంటున్నారు. ఆయన 2008 నుంచి పార్టీ జాతీయ మహాసభలకు హాజరవుతున్నారు. దీప్సిత గత అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని బాలి నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసింది.