May 26,2023 20:41

బదిలీల జాతర

ప్రజాశక్తి - కడప ప్రతినిధి
జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీల గుబులు పట్టుకుంది. ప్రభుత్వ పరిధిలో 120 డిపార్టుమెంట్లలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో బదిలీపై ఎక్కడికి వెళ్లాల్సి వస్తుందోననే టెన్షన్‌ వాతా వరణం నెలకొంది. జిల్లా పరిషత్‌, డిఇఒ, డిపఒఓ, డ్వామా, మెప్మా మొదలగు రంగాలతోపాటు ఇతర రంగాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగుల పెద్దఎత్తున బదిలీ కానున్నారు. ఇందులోభాగంగా ఈనెల 27 నాటికి మూడు రకాల ఆప్షన్లను ఎంపిక చేసుకోవాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో పని చేసే పలువురు ఉద్యోగులు సమీప, సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేయించుకునేందుకు పైరవీలను అశ్రయి స్తున్నారు. రాజకీయ ప్రాపకాన్ని ఆశ్రయించి తమకు కావాల్సిన చోటికి బదిలీ చేయించుకు నేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పలువురు ఉద్యోగులు రాజకీయ సిఫారసులు చేయించుకుని తమకు అవసరమైన ప్రాంతాలకు బదిలీ చేసు కుంటున్న సంగతి తెలిసిందే. రాజకీయ పైరవీలతో సురక్షిత ప్రాంతాన్ని దక్కించుకున్న ఉద్యోగులు రాజకీయ నాయకుల అవసరాలకు అనుగుణంగా నడుచు కోవాల్సి వస్తోందనే అంశాన్ని గమనంలో పెట్టుకోవాల్సి ఉంది. జిల్లా పరిషత్‌లో సుమారు 1000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సుమారు 250 మంది ఉద్యోగులకు బదిలీలకు అవకాశం ఉంటుంది. ఇదేతరహాలో మిగిలిన విభా గాల ఉద్యోగులకు బదిలీలు తప్పడం లేదు. బదిలీల్లో రాజకీయ సిఫారసుల ప్రభావాల ఫలి తంగా నిజాయితీగా బాద్యతలు నిర్వహించడం కష్టమనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా జిల్లాలోని 120 డిపార్టుమెంట్లలో గ్రూప్‌-1 నుంచి గ్రూప్‌-4 వరకు వివిధ సెక్షన్ల ఉద్యోగుల్లో పలువురు రాజకీయ పైరవీలను ఆశ్రయించడం అవాంచ óనీయం. నిజాయితీగా సీనియారిటీ ప్రాతిపదికన తమకు కేటాయించిన ప్రాంతంలో విధులు నిర్వహిస్తే పారదర్శకంగా విధులు నిర్వహించే అవకాశం ఉంటుంది. రాజకీయ పైరవీలతో సురక్షిత ప్రాంతాన్ని దక్కించుకున్న ఉద్యో గులు పారదర్శకంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం కష్టమనే సంగతిని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనడంలో సందేహం లేదు. 2024లో ప్రథమార్థంలో రానున్న సార్వత్రిక ఎన్ని కల నేప థ్యంలో రాజకీయ పైరవీల బాటపట్టిన ఉద్యోగులకు కత్తిమీద సామును తలపించే పరిస్థితిని ఎదుర్కొవాల్సి ఉంటుందని గ్రహించాలి.