ప్రజాశక్తి -కందుకూరు :రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ ,హ్యాండ్ బాల్ పోటీలకు జట్లను కందుకూరులో శనివారం ఎంపిక చేశారు. ఎంపికైన జట్లు ఈనెల 8వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగే పోటీలలో పాల్గొంటాయి. ఈ జట్లు విశాఖపట్నం జిల్లా అనకాపల్లి, అనం తపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగే పోటీలలో పాల్గొంటాయి. ఈ ఎంపిక కార్యక్రమంలో పిడి టి సుబ్బారావు, రిటైర్డ్ పిడి సయ్యద్ జిలాని పాల్గొన్నారు.
బాస్కెట్ బాల్ బాలికల జట్టు సభ్యులు వీరే
బాస్కెట్బాల్ బాలికల జట్టుకు కందుకూరు టిఆర్‌ఆర్ కాలేజీకి చెందిన ఎం అశ్విని, పి శాంతి, కే కల్పన, కే అనూష, పీ సుమతి, ఎం సుష్మ గాయత్రి, కే స్రవంతి, జి లక్ష్మీ శ్రావణి ,ఈ కౌసల్య, బి హరిత, కందుకూరు గాయత్రి కాలేజీకి చెందిన బి జాహ్నవి ,కందుకూరు శివ సాయి స్కూల్ కు చెందిన బి హిమజ ఎంపికయ్యారు.
బాస్కెట్ బాల్ బాలుర జట్టు సభ్యులు వీరే..
బాస్కెట్ బాల్ బాలుర జట్టుకు కందుకూరు టి ఆర్ ఆర్ జూనియర్ కాలేజ్ కి చెందిన సిహెచ్ హేమంత్, బి సాయి దీక్షిత్ ,టి విష్ణువర్ధన్ ,ఎం వేణుమాధవ్ ,కే వెంకటేష్ ,పి కరుణ సాగర్ ,కెవి వెంకటేష్ ,నాగార్జున జూనియర్ కాలేజీకి చెందిన ఎం సందీప్ ,వివేక కాలేజీకి చెందిన కె చందు ఎంపికయ్యారు.
హ్యాండ్ బాల్ బాలుర జట్టు సభ్యులు
హ్యాండ్ బాల్ బార్సు జట్టుకు కందుకూరు టి ఆర్ ఆర్ జూనియర్ కాలేజీకి చెందిన జి రవిచంద్ర ,వి నరేంద్ర, కే అశోక్, కే వెంకట సాయి, సిహెచ్ వి నాగేశ్వరరావు ,జె నాగబాబు, జి శ్రీ గణేష్ ,డి వెంకటేష్ ,జి గణేష్, కే శ్రీనివాసులు ,డి యువరాజు, బి శ్రీకాంత్, కే మహేష్ ,ఏకే పీకే జూనియర్ కాలేజ్ నుండి పి దివాకర్ ,ఎం రోహిత్ కుమార్ ,కందుకూరు వివేక కాలేజ్ కి చెందిన సిహెచ్ కౌశిక్ ఎంపికయ్యారు.










