రంజాన్ వేడుకల్లో ఎంఎల్‌ఎ కోటంరెడ్డి
బారాషాహీద్ దర్గాలో రూరల్ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి
నెల్లూరు:రంజాన్ పండుగ పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని రూరల్ నియాజకవర్గ పరిధిలోని బారాషాహీద్ దర్గాలో ముస్లిం సోదరులు నిర్వహించిన పార్ధనా కార్యక్రమంలో రూరల్ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డిలు పాల్గొన్నారు. శనివారం దర్గా ప్రాంగణంలో ముస్లిం సోదరులు ఏర్పాటుచేసిన దువ్వలో పాల్గొని ముస్లిం సోదరి, సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. బారాషాహీద్ దర్గాలో మసీదుకు, అభివద్ధి పనులకు రూ.15 కోట్ల మేరకు ఆర్ధిక పరమైన అనుమతులు మంజూరుకు కషి చేసిన రూరల్ ఎంఎల్‌ఎ కోటంరెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు అల్లా ఆశీస్సులు ఉండాలంటూ ముస్లీం మత పెద్దలు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.










