Mar 31,2023 20:27

బార్‌ అసోసియేషన్‌కు ఎన్నికైన సభ్యులు

రాయచోటి : రాయచోటి బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదుల సంఘం ఎన్నికల్లో సీనియర్‌ న్యాయవాది కె.నాగిరెడ్డి అధ్యక్షులుగా గెలిచారు. శుక్రవారం ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల్లో 72 ఓట్లుకుగాను నాగిరెడ్డికి 42 వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా ఉదయగిరి రామాంజనేయులు, నాగమల్లుకు సమాన ఓట్లు రావడంతో చెరో ఆరు నెలలు ప్రధాన కార్యదర్శిగా ఉండేటట్లుగా ఒప్పందం కుదిరింది. ఉపాధ్యక్షులుగా పగడాల శ్రీనివాసులు, ట్రెజరర్‌గా వీరభద్రయ్య, స్పోర్ట్స్‌ కార్యదర్శిగా సిద్దయ్య, లైబ్రరీ సెక్రటరీగా రమణమూర్తి ఎన్నికల్లో గెలుపొందారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత విలేకరులతో నాగిరెడ్డి మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో చాలా మంది న్యాయవాదులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపారు. వారి హక్కుల సాధన కోసం నాపై బాధ్యత ఉంచినందుకు నిర్విరామంగా కృషి చేసి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో న్యాయవాదులపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయన్నారు. న్యాయవాదుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తేవడానికి కృషి చేస్తామన్నారు.