Nov 10,2023 23:56

మాట్లాడుతున్న అధికారులు

ప్రజాశక్తి-పుల్లలచెరువు : బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని డిఎల్‌డిఒ సాయికుమార్‌ తెలిపారు. అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ కెవి.సుబ్బమ్మ అధ్యక్షతన బాల్య వివాహాల నిర్మూలనపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయికుమార్‌ మాట్లాడుతూ 2006 బాల్యవివాహాల నిరోధక చట్టం గురించి, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, సమస్యల గురించి వివరించారు. బాల్య వివాహం జరిపిస్తే తల్లి దండ్రులు, పెద్దలు, వివాహం చేసిన పురోహితుడు, వివాహ కార్యక్రమంలో పాల్గొన్న బంధువులు కూడా శిక్షార్హులన్నారు. రూ.2 లక్షలు జరిమానా, రెండు సంవత్సరాల జైలు శిక్ష పడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ మరియదాసు, ఎంఈఓ ఇందిర, ఏపిఎం వెంకటయ్య, ఎస్‌ఐ శ్రీహరి,డాక్టర్‌ నయాజ్‌ తదితరులు పాల్గొన్నారు. కొనకనమిట్ల : బాల్యవివాహాల నిర్మూలనకు అందరూ కృషి చేయాలని ఎంపిడిఒ శ్రీనివాస్‌ మూర్తి తెలిపారు. మండల స్థాయి బాల్య వివాహాల నిరోధక కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ మాట్లాడుతూ బాలికల్లో రక్తహీనత రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పౌష్టికాహారం లోపం లేకుండా ఉండేందుకు అంగన్‌వాడీ సూపర్‌ వైజర్లు, కార్యకర్తలు అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై చర్యలు తీసుకునేలా కమిటీ సభ్యులు. ప్రతి నెలా మొదటి శుక్రవారం గ్రామాలలో, రెండో శుక్రవారం మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ బాలయ్య,వెలుగు ఎపిఎం గోపాల్‌ కష్ణారెడ్డి,ఎంఇఒ బరిగ నరసింహారావు, హెల్త్‌, అంగన్‌వాడీ సూపర్‌ వైజర్లు పాల్గొన్నారు.