బాల్య వివాహాలపై అవగాహన
ప్రజాశక్తి-బిట్రగుంట : బోగోలు 1 సచివాలయం పరిధిలోని అంగన్‌వాడీకేంద్రంలో మహిళలు, కిశోర బాలికలకు చైల్డ్ సెక్స్‌రేషియో, బాల్య వివాహాలు కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాన్ని అంగన్‌వాడీ ఇన్‌ఛార్జి సూపర్‌వైజర్ సుప్రజ, మహిళా పోలీస్ పుష్పలత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 24న జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న వివక్షతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందన్నారు. అందులో భాగంగా 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు అంగన్‌వాడీ పాఠశాలలో గ్రామసభలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గర్భస్థ లింగ నిర్థారణ పరీక్షలపై ప్రభుత్వ చేస్తున్న చట్టాలపై, ఆడపిల్లలపై నిర్లక్షం, వివక్షత, ఆడపిల్లల రక్షణ భద్రత కోసం భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి సూపర్‌వైజర్, మహిళ పోలీస్, అంగన్‌వాడీ కార్యకర్తలు, స్కూల్‌టీచర్స్, మహిళలు, కిషోర్ బాలికలు, తదితరులు పాల్గొన్నారు.










