Nov 14,2023 23:27

కొండపిలో దేశ నాయకుల వేషదారణలో చిన్నారులు

ప్రజాశక్తి -సిఎస్‌పురం : మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చెన్నపునాయునిపల్లి పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కొలతలు, తూనికలు శాఖ మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ చిట్టిబోయిన మౌలాలి యాదవ్‌ మాట్లాడారు. కదిరి వెంకట నరసయ్య లక్ష్మమ్మ జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో కోవిలంపాడు సర్పంచ్‌ షేక్‌ ఖాదర్బి బుజ్జి మాట్లాడారు. నల్లమాడుగుల హైస్కూల్‌లో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మానవహక్కుల సంఘం అధ్యక్షులు షేక్‌ గౌస్‌ పాల్గొన్నారు.
దర్శి : బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా యువజన కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ కైపు వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక గీతాంజలి కళాశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు ఈనెల 19వ తేదీన బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్ర మంలో వంశీ, సుదర్శన్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.
తాళ్లూరు : బాలల దినోత్సవం సందర్భంగా మాజీ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ చిత్రపటానికి జడ్‌పటిసి మారం వెంకటరెడ్డి, వైస్‌ ఎంపిపి వెంకటేశ్వరరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి చార్లస్‌ సర్జన్‌, సర్పంచులు వలి, శ్రీకాంత్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, ఎంఇఒం సుబ్బయ్య, ఎఒ ప్రసాద్‌ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పొదిలి : స్థానిక సెయింట్‌ ఆన్స్‌ హైస్కూల్‌లో బాలల దినోత్సవ వేడుకలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా స్కూల్‌ డైరెక్టర్‌ నారాయణ మాట్లాడుతూ మాజీప్రధాని జవహార్‌ లాల్‌ నెహ్రూ జీవిత చరిత్ర గురించి విద్యార్థులకు వివరిం చారు.అనంతరం కేక్‌ కట్‌చేశారు. ఈ కార్యక్ర మంలో హెడ్‌మిసెస్‌ జాక్విన్‌, ఉపాధ్యా యులు , విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
గీతాంజలిలో స్కూల్‌లో
స్థానిక గీతాంజలి స్కూల్‌లో నెహ్రు పుట్టినరోజు సందర్భంగా చిల్డ్రన్స్‌ డే వేడుకలు నిర్వహించారుఈ సందర్భంగా స్కూల్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ కె. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ జవహర్‌ లాల్‌ నెహ్రూ జీవిత విశేషాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో స్కూల్‌ డైరెక్టర్లు కె.ప్రజ్వల ,దుర్గ ప్రసాద్‌, సెక్రటరీ కె .అలేఖ్య పాల్గొన్నారు.
కనిగిరి : కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని కాశిరెడ్డి గిరిజన కాలనీ ప్రాధమిక పాఠశాలలో అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాలు, బాలల దినోత్సవం మంగళవారం నిర్వహించారు. మండల విద్యా శాఖ ఆధ్వర్యంలో మండల న్యాయ సేవాధికార సంస్థ,గుడ్‌ హెల్ప్‌ ఫౌండేషన్‌ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌, న్యాయవాది షేక్‌ అబ్దుల్‌ గఫార్‌ మాట్లాడుతూ విద్యార్థులు ప్రాథమిక తరగతులలో విలువలతో కూడిన విద్యను క్రమశిక్షణతో అభ్యసించాలన్నారు. నెహ్రూ అడుగుజాడల్లో నడిచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. అనంతరం విద్యార్థులకు వార్డు వాలంటీర్‌ పి.నవ కుమార్‌ సహకారంతో కాపీ రైటింగ్‌ పుస్తకాలు,పెన్సిళ్లు పంపిణీ చేసారు. ఉపాధ్యాయులు పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛారి. ప్రధానోపాధ్యాయురాలు వి. జయశ్రీ, ఉపాధ్యాయులు శ్రీనివాసులు, ఎస్‌కె, కాసిం సాహెబ్‌, న్యాయవాది షేక్‌ సుమైర్‌, గుడ్‌ హెల్ప్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ రమేష్‌ బాబు, జిఎస్‌ అండ్‌ జిడికె ఫౌండేషన్‌ చైర్మన్‌ శామ్యూల్‌ గెర్షోమ్‌, వార్డు వాలంటీర్‌ పి. నవ కుమార్‌ కౌన్సిలర్‌ సతీష్‌, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కిడ్స్‌ పాఠశాలలో..
స్థానిక ఐకిడ్స్‌ పాఠశాలలో జాతీయ బాలల దినోత్సవం వేడుకలు నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్‌ షేక్‌ రజియా, ప్రిన్సిపల్‌ షేక్‌ షరీఫ్‌ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. తొలుత నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిన్నారులు అంబేద్కర్‌, గాంధీజీ వేషధారణలతో అలరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జబినా, మల్లేశ్వరి, గీతా,ఉషా, లలితా, ప్రియదర్శిని, మైమూన్‌, శిరీష, పాఠశాల ఇన్‌ఛార్జి వరలక్ష్మి చిన్నారులు తదితరలు తదితరులు పాల్గొన్నారు
కొండపి : మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వెన్నూరు జిల్లా పరిషత్‌ ఉన్న పాఠశాలలో ప్రధానోపాద్యాయులు డి.భారతి అద్యక్షతన బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వ్యాసరచన, వ్యక్తృత్వ, పాటల పోటీల్లోని విజేతలకు బహుమతులు అందజేశారు.
దర్శి : మండల పరిధిలోని చందలూరు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో బాలల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వివిద పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గురుప్రసాద్‌ పాల్గొన్నారు. స్థానిక గ్రంథాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో సంఘ సేవకులు జివి. రత్నం, ఇన్‌ఛార్జి గ్రంధపాలకురాలు పద్మావతి, సుధాకర్‌, డేవిడ్‌, కోటయ్య, భూషణ్‌ తదితరులు పాల్గొన్నారు.