Mar 02,2023 19:03

ప్రదర్శన చేపట్టిన బాలికలు

ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరు అర్బన్‌ పరిధిలోగల కెజిబివి బాలికల స్కూల్‌, కళాశాలలో భేటీ బచావో భేటీ పఢావో కార్యక్రమం గరువారం జరిగింది. కందుకూరు ఉప జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ఎం ప్రియంవద పిల్లల రక్షణ, భ్రూణ హత్యల నివారణపై మాట్లాడారు. కూతురు అంటే భారం కాదని, పదిమంది కొడుకులతో సమానమని తెలిపారు. భ్రూణ హత్యలు లేని సమాజాన్ని నిర్మించాలన్నారు.కందుకూరు బాలుర ఉన్నత పాటశాల ప్రధానోపాధ్యాయులు డి. అనురాధ మాట్లాడుతూ బాలికలు బాగా చదువుకొని భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవాలని సూచించారు. అర్బన్‌ వైద్యాధికారి డాక్టర్‌ భ్యూలా గ్రేస్‌మాట్లాడారు. కెజిబివి స్పెషల్‌ ఆఫీసర్‌ స్వాతి, ఐసీడీఎస్‌ సూపర్వైజర్‌ అంజమ్మ, హెచ్‌ఈఓ షేక్‌. ఆరీఫుల్లా, హెల్త్‌ సూపర్‌ వైజర్‌లు యం. శ్రీనివాస రావు, కే.పద్మావతి, సిబ్బంది పాల్గొన్నారు.