రాయచోటి : అన్నమయ్య జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు కషి చేయాలని కలెక్టర్ గిరిషా పి.ఎస్ ఆదేశించారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్ లోని మినీ విసి హాల్లో బాల కార్మికుల జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్ములనకు అవ సరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పిల్లలను కార్మికులుగా మార్చకుండా తల్లితండ్రులకు అవగాహన కల్పిం చాలన్నారు. తరచూ తనిఖీలను నిర్వహిస్తూ బాలలను పనిలో పెట్టుకున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈనెల 1 నుంచి 30 వరకు జిల్లాలో బాల కార్మికులను గుర్తించి వారిని రిహాబి టేషన్ చేయుడంతో పాటు బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యాజ మాన్యాలపై కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు. ప్రధానంగా మున్సి పాల్టీ పరిధిలో చిన్న, చిన్న హోటళ్లల్లో బాల కార్మికులు పనచేస్తున్నారో లేదో తనిఖీలు నిర్వహించి రిపోర్టు ఇవ్వాలని కమిషనర్లను ఆదేశించారు. చిన్న, చిన్న ఫ్యాక్టరీలు, గ్రైనైట్స్ తయారీ, ఇటుకుల బట్టీ తయారీలో బాల కార్మికులు ఉంటే వెంటనే సంబంధిత యాజమాన్యం పై కేసులు నమోదు చేయించాలన్నారు. బడి మానేసి పనులకు వెళుతున్న పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమం చేపట్టాలని విద్యా శాఖదికారులను ఆదేశించారు.
కార్మికులకు కనీస వేతనం నిర్ధారించాలి
ప్రభుత్వ శాఖలలో పనిచేసే ఎన్‌ఎంఆర్, మజ్దూర్ కార్మికులకు కనీస వేతనం నిర్ధారించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతలో ప్రభుత్వ శాఖలలో పనిచేసే కార్మికులకు, నైపుణ్యం కల్గిన కార్మికలకు రూ. 570, సెమీ స్కిల్డ్ రూ. 499, మున్సిపాల్టీ పరిధిలోని ఎన్‌ఎంఆర్, మజ్దూర్ కార్మికులకు రూ. 605, సెమీ స్కిల్డ్‌కు రూ. 562, అన్‌స్కిల్డ్‌కు రూ. 522 కనీస వేతనం వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా లేబర్ డిపార్ట్‌మెంట్ ఇన్‌ఛార్జి అధికారి డి.వి. రంగరాజు, ఇరిగేషణ్ ఎస్‌ఇ కృష్ణమూర్తి, ఎపిఎస్‌పిడిసిఎల్ ఎస్‌ఇ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ ప్రసన్నకుమార్, డిఆర్‌డిఎ పీడీ సత్యనారాయణ, డిపిఒ ధనలక్ష్మి, జిల్లా అగ్రికల్చర్ అధికారి ఉమామహేశ్వరమ్మ, కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో










