బాధితుడికి ఆర్థికసాయం అందజేత
కదిరి టౌన్ : కదిరి పట్టణానికి చెందిన చాంద్ రెండు రోజుల క్రితం జిమాన్ సర్కిల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. విషయాన్ని బత్తల యువసేన నాయకులు వైఎస్‌ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ బత్తల హరిప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన హరిప్రసాద్ బాధితుడుని మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించడానికి సహకరించారు. గాయపడిన చాంద్‌కు తన తండ్రి, మాజీ సర్పంచ్ వెంకటరమణ ద్వారా 10వేలను అందజేశారు. ఈ కారక్రమంలో పట్నం శామీర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.










