Jan 01,2023 19:39

బాధితునికి ఆర్థిక సాయం చేస్తున్న మహ్మద్‌ఖాన్‌

ప్రజాశక్తి - రాయచోటి టౌన్‌హొ: పట్టణానికి చెందిన మహ్మద్‌ బైక్‌ మెకానిక్‌ అనారోగ్యంతో బాధపడుతుండడంతో విషయం తెలుసుకుకున్న వైసిపి మైనార్టీ నాయకులు బేపారి మహ్మద్‌ఖాన్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఫాయాజూర్‌ రహమాన్‌ పరామర్శించారు. అతని ఆరోగ్యం కోసం ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. వారి వెంట మున్సిపల్‌ కౌన్సిలర్‌ అన్నా సలీం, మైనార్టీ నాయకులు అజంతుల్లా, బేపారి జబివుల్లా, 9వ వార్డు కన్వీనర్‌ ఉబైదుర్‌ రహమాన్‌, దివాకర్‌ పాల్గొన్నారు.