బాధిత రైతులను ఆదుకుంటాం..
ప్రజాశక్తి-జలదంకి : అకాల వర్షానికి పంట నష్టపోయిన ప్రతి రైతన్నకు ప్రజలకు ప్రభుత్వం నుంచి పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎంఎల్‌ఎ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం జలదంకి మండలంలోని అన్నవరం పంచాయతీలో దెబ్బతిన్న వరి పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు తాను ఉన్న సమయంలో అకాల వర్షం కురిసిందని పంటలు దెబ్బ తిన్నాయని విషయాన్ని నేతలు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. మండలంలోని పలు గ్రామాలలో వరి పంట పూర్తిగా దెబ్బతిందని న్యాయంగా రైతన్నలకు అందాల్సిన పరిహారం అందించేందుకు ఎంఎల్‌ఎగా తాను కృషి చేస్తానన్నారు. కావలి ఆర్‌డిఒ శీనానాయక్ మాట్లాడుతూ పంట నష్టం అంచనా నివేదికను సిద్ధం చేసి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ క్రాఫ్ట్ నమోదు చేసిన చేయకపోయినా నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ పద్మావతి, ఎంపిడిఒ శ్రీధర్, మండల వ్యవసాయ అధికారిణి శైలజ, మండల అధికారులు, నెల్లూరు జిల్లా ప్రచార విభాగం అధ్యక్షులు పాలవల్లి మాల కొండారెడ్డి, మండల అధ్యక్షులు గోచిపతల వెంకటరమణయ్య, గుర్రం జగ్గయ్య, సింగిల్ విండో అధ్యక్షులు కేతిరెడ్డి రవీంద్రారెడ్డి, కేశవరం సర్పంచ్ రావి ప్రసాదు నాయుడు, అన్నవరం సచివాలయం కన్వీనర్ దామెర్ల దేవదాసు, వైసిపి నాయకులు గుమ్మిడి రమేష్, వైసిపి మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.










