చెడిపోయిన టమోటాను పరిశీలిస్తున్న నాయకులు
తాడిమర్రి : అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు జంగాలపల్లి పెద్దన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం మండలంలోని మద్దెల చెరువు గ్రామంలో వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించారు. గ్రామంలోని రైతు చలపతి కి చెందిన వ్యవసాయ భూమిలో టమోటా పంటను పరిశీలించారు. వర్షాలకు నష్టపోయిన టమోటా, వరి ,అరటి రైతులకు ఎకరాకు లక్ష రూపాయలు చొప్పున పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మారుతి, రమణ తదితరులు పాల్గొన్నారు.










