బాధిత కుటుంబానికి పరామర్శ
ప్రజాశక్తి-అల్లూరు : మండలంలోని నార్త్ మోపూరు గిరిజన కాలనీకి చెందిన పులి శ్రీహరి(20) 20వ తేదీ పాముకాటు గురై మరణించగా ఆ కుటుంబాన్ని ఆదివారం నేషనల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు, వైసిపి ఎస్‌టిసెల్ మండల అధ్యక్షులు దాసరి పోలయ్య పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకుతెరువు కోసం వెళ్లి ప్రాణం విడిచి వెళ్లాడంటూ విచారం వ్యక్తం చేశారు. సంబంధిత విషయాన్ని ఐటిడిఎ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆ కుటుంబానికి న్యాయం చేస్తానని హామీనిచ్చారు. గోగులపల్లికి వెళ్లేదారిలో ఉన్న సాల్ట్ ఫ్యాక్టరీ సమీపంలోని పొలాల వద్ద మందును పిచికారి చేస్తూ ఉండగా ఈ దుర్ఘటన జరిగిందని వివరించారు. హుటాహుటిన నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడే మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. అలాగే స్థానికుల ద్వారా మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.










