Nov 14,2023 21:09

ఆర్థిక సాయం అందజేస్తున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి - మంత్రాలయం
వినాయక చవితి పండగ సందర్భంగా విద్యుదాఘాతంతో మృతి చెందిన పవన్‌ కల్యాణ్‌ కుటుంబానికి రాంపురం రెడ్డి సోదరులు రూ.40 వేల ఆర్థిక సహాయం అందజేశారు. మంగళవారం 'ఎపికి జగనే ఎందుకు కావాలి'లో భాగంగా సచివాలయం-3లో ప్రభుత్వం నుంచి మంజూరైన సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించి, అనంతరం పవన్‌ తండ్రికి నగదు అందించారు. గతంలో మృతుని కుటుంబానికి భీమా ఆటో యూనియన్‌ తరఫున రూ.50 వేల ఆర్థిక సహాయం అందించిన విషయం తెలిసిందే. అండగా ఉంటామని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, టిటిడి పాలకమండలి సభ్యులు వై. సీతారామిరెడ్డి హామీ ఇచ్చారు. వైసిపి మండల అధ్యక్షులు జి.భీమిరెడ్డి, ఇన్‌ఛార్జీ విశ్వనాథ్‌ రెడ్డి, సర్పంచి తెల్లబండ్ల భీమయ్య, నాయకులు జనార్ధన్‌ రెడ్డి పాల్గొన్నారు.