Sep 27,2023 20:42

సమావేశంలో నేతలతో చర్చిస్తున్న మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి

సమావేశంలో నేతలతో చర్చిస్తున్న మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి
బాబుతో నేను కరపత్రాలు ప్రతి ఇంటికీ చేరాలి..
-అక్టోబర్‌ 2న శాంతియుత ర్యాలీ చేపట్టాలి.
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ:రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్‌ చేయించిందని ప్రజలకు వివరించేందుకు బాబుతో నేను కరపత్రాలు ప్రతి ఇంటికీ చేర్చి ప్రజలను చైతన్య పరచాలని మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి , ఆనం రామనారాయణ రెడ్డిలు పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని టిడిపి కార్యాలయంలో పార్లమెంటు టిడిపి అధ్యక్షులు అబ్దుల్‌ అజీజ్‌ అధ్యక్షతన జిల్లా ముఖ్య నేతలతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు చంద్రబాబు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. అనంతరం వారు పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర పిలుపుమేరకు జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించారు. బాబుతో నేను కరపత్రాలు ప్రతి ఇంటికీ చేరాలని నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలకు సూచించారు. అక్టోబర్‌ 2న ఉమ్మడి నెల్లూరు జిల్లాల ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించాలని సూచించారు
. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, మాజీ మంత్రులు తాళ్లపాక రమేష్‌ రెడ్డి, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, తిరుపతి పార్లమెంటు టిడిపి అధ్యక్షులు నరసింహ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్‌ కుమార్‌, కుంభం విజయరామిరెడ్డి, కావలి నియోజవర్గ ఇన్చార్జి మాలపాటి సుబ్బరాయుడు, నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.