Sep 27,2023 20:46

వినూత్నంగా నిరసన తెలుపుతున్న దృశ్యం
బాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ..
-కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టి నిరసన
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ:నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ఖండిస్తూ మహిళలు గర్జించారు. కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టి ప్లే కార్డులు చేతబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జగన్‌ ప్లే కార్డును చెప్పులతో తొక్కుతూ మోకాళ్లపై నిలబడి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. నెల్లూరు నగరం టిడిపి కార్యాలయం వద్ద మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రిలే నిరాహార దీక్షలు తెలుగు మహిళలు వినూత్న నిరసన తెలియజేశారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల పట్ల కంసుడిగా తయారయ్యాడని మహిళలు మండిపడ్డారు.
అక్రమంగా చంద్రబాబుపై కక్షతోనే అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వైసిపికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.