May 03,2021 11:51

పేరు : సిద్ధార్థ్‌ శ్రీరామ్‌
నిక్‌నేమ్‌ : సిధ్‌
పుట్టిన తేదీ : 1990, మే 19
పుట్టిన ప్రాంతం : చెన్నరు
పెరిగిన ప్రాంతం : కాలిఫోర్నియా
చదువు : మూజిక్‌ ప్రొడక్షన్‌ అండ్‌
ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌
హాబీస్‌ : రైటింగ్‌, ట్రావెలింగ్‌
ఇష్టమైన నటులు : రజనీకాంత్‌
సంగీదర్శకులు : ఏఆర్‌ రెహ్మన్‌,
జాకీర్‌ హుస్సేన్‌
నివాస ప్రాంతం : చెన్నరు
తల్లిదండ్రులు : శ్రీరామ్‌, లతా శ్రీరామ్‌
సోదరి : పల్లవి శ్రీరామ్‌
   కార్తీక్‌, సోనూ నిగమ్‌ లాంటి గాయకులకు ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఆ తర్వాత ఆ స్థాయిలో మాయ చేసిన సింగర్‌ మరొకరు లేరనే చెప్పాలి. ఇలాంటి సమయంలో కొన్నేళ్లుగా ఓ కుర్ర గాయకుడు తన గాత్రంతో అందర్నీ మాయ చేస్తున్నాడు. అతడి పేరు సిధ్‌ శ్రీరామ్‌. సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌ గురించి పెద్దగా పరియం అక్కర్లేదు. ఈ మధ్యకాలంలో యూత్‌లో బాగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న సింగర్‌ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీరామ్‌ ఒక్కరే. సిద్‌ పాట లేనిదే ఈ మధ్య సినిమాలు లేవనడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు బాలు, యేసుదాస్‌ లాంటి గాయకులతో తమ సినిమాలో కచ్చితంగా కనీసం ఒక్క పాటైనా పాడించాలని సంగీత దర్శకులు కలలు కనేవాళ్లు. కుదరకపోతే ఎలాగోలా కుదిరించుకుని మరీ వాళ్లతో పాడించే వాళ్లు. అలాంటి రోజులు మళ్లీ ఇప్పుడు సిధ్‌ శ్రీరామ్‌ తీసుకొస్తున్నాడు.
   శ్రీరామ్‌ తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. అతనికి సంవత్సరం వయసున్నప్పుడు తల్లిదండ్రులు కాలిఫోర్నియా వెళ్లిపోయారు. వారితోపాటే శ్రీరామ్‌ కూడా కాలిఫోర్నియాలో ఫ్రీమాంట్‌లో పెరిగాడు. సిద్‌ విద్యాభ్యాసం అక్కడే కొనసాగింది. సిద్‌ తల్లి లతా శ్రీరామ్‌ శాన్‌ఫ్రాన్సిస్‌కోలోని బే ప్రాంతంలో కర్ణాటక సంగీత ఉపాధ్యాయురాలు కావడంతో సహజంగానే ఆ నైపుణ్యాలు శ్రీరామ్‌కు అబ్బాయి. దీంతో శ్రీరామ్‌ కొంత కాలం ఆఫ్రికన్‌, అమెరికన్‌ పాప్‌ సింగింగ్‌ అయిన ఆర్‌ అండ్‌ బి గాయకుడిగా కొనసాగాడు. 2008లో మిషన్‌ శాన్‌ జోస్‌ హైస్కూల్‌ నుండి పట్టా పొందిన తరువాత, అతను బెర్ల్కీకాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌లో చేరాడు. మ్యూజిక్‌ ప్రొడక్షన్‌, ఇంజనీరింగ్‌లో పట్టా పొందాడు.
   ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరపరచిన కదల్‌ (2013) సౌండ్‌ట్రాక్‌ కోసం పాడిన 'అడియే' పాటతో మన దేశంలో ప్రజాదరణ పొందారు. ఐ (2015) సౌండ్‌ట్రాక్‌ కోసం 'ఎన్నోడు నీ ఇరుంతాల్‌'ను అందించినందుకు ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌గా ఫిలింఫేర్‌ అవార్డును గెలుచుకున్నాడు.
   థాల్లి పొగతేరులో 'అచ్ఛం ఎంబాదు మాదమైయ్యాడా', మరు వార్తరు పెసతేలో 'ఎనైనోకి పాయుమ్‌ తోట', హుషారులో 'ఉండిపోరాదే', నిన్ను కోరిలో 'అడిగా అడిగా', గీతా గోవిందంలో 'ఇంకేం ఇంకేం ఇంకేం కావాలె', హై న లవ్‌లో 'ప్యార్‌ ప్రేమ కాదల్‌', ఎనది మాయావినీలో 'వదచెన్నరు', టాక్సీవాలాలో 'మాటే వినదగు,' ఇష్క్‌లో 'పరయువాన్‌' అల వైకుంఠపురములో 'సామజవరగమనా' ఇలా అన్ని పాటలూ బాగా గుర్తింపు తెచ్చాయి. ఆయన ఇటీవల కొన్ని మలయాళ పాటల్లో కూడా పనిచేశారు.
శ్రీరామ్‌ పాట ఉంటే సినిమాకు బిజినెస్‌ అయిపోతుంది. అంతగా మాయ చేస్తున్నాడు ఈ కుర్ర గాయకుడు. ఈయనతో సినిమాలో ఒక్క పాట అయినా పాడించాలని కలలు కంటున్నారు సంగీత దర్శకులు. ఈయన పాడితే సినిమాకు అదే ప్లస్‌ అవుతుంది. ఈ మధ్య కాలంలో కేవలం సిధ్‌ శ్రీరామ్‌ పాటలను ప్రమోషన్‌ చేసుకుని సినిమా బిజినెస్‌ కూడా పూర్తి చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఒకవేళ సినిమా యావరేజ్‌ టాక్‌ సంపాదించుకున్నా ఆయన పాట మాత్రం సూపర్‌ హిట్‌ అవుతోంది. కొన్నిసార్లు అయితే సిద్‌ శ్రీరామ్‌ పాడిన పాటలతోనే సినిమాపై హైప్‌ క్రియేట్‌ అవుతుంది. దీంతో ఆయనతో ఒక్క పాట అయినా పాడించాలని సంగీత దర్శకులు ఉవ్విళూరుతున్నారు.
   ఇటీవల యాంకర్‌ ప్రదీప్‌ హీరోగా వచ్చిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో 'నీలినీలి ఆకాశం' పాటతోనే బిజినెస్‌ అయిపోయింది. శశి సినిమాలో 'ఒకేఒక లోకం నువ్వు' పాట అద్భుతాలు చేసింది. దానికి ముందు అల వైకుంఠపురంలో సామజవరగమనా ఏజ్‌ గ్యాప్‌తో పని లేకుండా అందర్నీ మాయలో ముంచేసింది. గీత గోవిందం ఇంకేం కావాలి పాట ఇప్పటికీ మధురమే. ఇలా సిద్‌ గళం నుంచి ఏ పాట వచ్చినా కూడా సూపర్‌ హిట్టే. దానికి మరో మాటే లేదు. అంత క్రేజ్‌ ఉంది కాబట్టే ఈయన కోసం సంగీత దర్శకులు కూడా ఎగబడుతున్నారు. ఈ కోవలోనే మాటె వినదుగ..వినదుగ, ఏమై పోయావే' వంటి పాటలు సిద్‌ శ్రీరామ్‌ పాడినవే. అయితే ఆ సినిమాల రిజల్ట్‌ ఎలా ఉన్నా సిద్‌ శ్రీరామ్‌ పాట మాత్రం? హిట్‌ అవుతోండటంతో సినిమా ప్రమోషన్‌గా వాడేస్తున్నారు నిర్మాతలు.

ఆయన పాటే సినిమాకు ప్లస్‌