Dec 20,2020 11:35

కావాల్సిన పదార్థాలు : 

      కొర్రలు - 100 గ్రాములు, గుమ్మడిపండు - 300 గ్రాములు, పాలు - 300 మి.లీ, మైదా - 300 గ్రాములు, ఈస్ట్‌ - 4 గ్రాములు, పంచదార - 30 గ్రాములు, కిస్‌మిస్‌, క్రాన్‌ బెర్రీ ముక్కలు - గుప్పెడు, నువ్వులు - అలంకరణకు, నెయ్యి - తగినంత.
 

తయారుచేసే విధానం : 

     కొర్రలను ఐదు గంటలసేపు నానబెట్టి వడకట్టాలి. గుమ్మడి ముక్కలతో పాటు కొర్రలు వేసి కుక్కర్లో ఉడికించాలి. చల్లారాక, మిక్సీలో పాలతో పాటు వేసి గుజ్జుగా చేయాలి. ఈ మిశ్రమంలో పంచదార, మైదా, ఈస్ట్‌ వేసి ఉండలు లేకుండా కలిపి, ప్లాస్టిక్‌ పేపరు కప్పి పక్కనుంచాలి. మిశ్రమం పొంగిన తర్వాత కిస్‌మిస్‌, క్రాన్‌బెర్రీల తరుగు వేసి మరోసారి కలపాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఒక పాత్రలో పోసి పైన నువ్వులు చల్లి కుక్కర్లో ఉంచి అరగంట ఉడికించాలి. తర్వాత ప్లేట్‌లో బోర్లించి ముక్కలుగా కోయాలి.