Mar 31,2023 22:50

సమావేశంలో పాల్గొన్న సవితమ్మ , తదితరులు

ప్రజాశక్తి -పెనుకొండ : నియోజకవర్గం ఈ నాలుగేళ్లలో పెనుకొండ ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ చేసిన అభివృద్ధి, అవినీతి పై చర్చకు సిద్ధం అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ సవాల్‌ విసిరారు. శుక్రవారం పట్టణంలోని సవితమ్మ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నియోజక వర్గం లో టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర సక్సెస్‌ అవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కొంతమంది పనిగా పెట్టుకొని లోకేష్‌ పాదయాత్ర కు వస్తున్న ప్రజాదరనను చూసి ఓర్వలేక లేనిపోనివి మాట్లాడుతున్నారన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తామని నారా లోకేష్‌ హమీ ఇచ్చారని సవితమ్మ తెలిపారు. తాను కమ్మ సవితమ్మ నా లేక కురుబ సవితమ్మ అనేది ప్రజలకు తెలుసన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్‌ నాయకులు మాధవ నాయుడు, గుట్టూరు సూర్యనారాయణ, శ్రీరాములు, త్రివేంద్ర, ప్రసాద్‌, సుబ్రహ్మణ్యం, మణికంఠ, దాదు, నరసింహ, శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.