Dec 01,2022 21:28

ర్యాలీలో పాల్గొన్న జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌

          పుట్టపర్తి అర్బన్‌ : హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ పట్ల అవగాహన పెంచుకుని దానిని పూర్తిగా రూపుమాపేందుకు రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌ పేర్కొన్నారు. గురువారం నాడు ప్రపంచ ఎయిడ్స్‌ నిర్మూలనా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్‌ నివారణ, నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో పుట్టపర్తిలోని కలెక్టర్‌ కార్యాలయం నుంచి సత్యమ్మ దేవాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్‌ కలెక్టరేట్‌ వద్ద ర్యాలీని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎయిడ్స్‌ నిర్మూలన పట్ల విస్తతంగా అవగాహన కల్పించాలన్నారు. హెచ్‌ఐవితో జీవిస్తున్న వారి వివరాలు, వారికి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల ద్వారా అందుతున్న సహాయ సహకారాల గురించి జెసి ఆరా తీశారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా||ఎస్‌వి.కష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచ ఎయిడ్స్‌ దినం సందర్భంగా ఒక నినాదాన్ని ఇస్తుందన్నారు. ఈ సంవత్సరం 'సమానత్వం' అనే నినాదంతో ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని జరుపుకోవాలని సూచించిందని తెలిపారు. ఈ ర్యాలీలో వెంకటేష్‌ కళాజాత బందం వీధి నాటక కళారూపం ద్వారా ప్రజలకు హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ పట్ల అవగాహన కల్పించారు. ఈ ర్యాలీలో జిల్లా లెప్రసీ ఎయిడ్స్‌, టిబి నియంత్రణ అధికారి డాక్టర్‌ తిప్పయ్య, బుక్కపట్నం వైద్యాధికారి డా||సునీల్‌, డెమో బాబా ఫకద్దీన్‌, జిల్లా ఎయిడ్స్‌ నివారణ, నియంత్రణ విభాగం డిపిఎం వెంకటరత్నం, టిబి.సూపర్‌వైజర్‌ హాబీబ్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.