అవార్డు గ్రహీతలకు సన్మానం
ప్రజాశక్తి-ఉదయగిరి : జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డ్ గ్రహీతలను ఎంపిడిఒ ఐజాక్ ప్రవీణ్ సన్మానించారు. బుధవారం స్థానిక స్త్రీ శక్తి భవనంలో అంతర్జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా వెంగళరావు నగర్ పంచాయతీ జిల్లాస్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డ్ అందుకున్న వారిని ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామపంచాయతీ రాష్ట్రస్థాయిలో అవార్డు వచ్చేలా ఆయా గ్రామ సర్పంచ్‌కు కృషి చేయాలన్నారు. వెంగళరావునగర్ గ్రామ పంచాయతీకి జిల్లా స్థాయిలో పేదరిక నిర్మూలన అనే అంశంపై ఉత్తమ పంచాయతీగా అవార్డు దక్కడం అభినందనీయమని ఇదే స్ఫూర్తితో జాతీయ రాష్ట్రస్థాయిలో అవార్డులు దక్కే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండల విస్తరణ అధికారి మల్లికార్జున్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు అవార్డు సాధించాలని కోరారు. అనంతరం సర్పంచ్ మొండ్రు కార్యదర్శి షేక్ అంచె హీనా, డిడిఒ కార్యదర్శి అమర్నాథన్‌ను శాలువాలతో గజమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎఒ రేణుక, జూనియర్ అసిస్టెంట్ గౌస్ అహ్మద్, మండల కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.










