ప్రజాశక్తి-తిరుపతి : తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాతకాలవలో నివాసమున్న ఇంటిలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు ఎన్.చిరంజీవి(32)గా పోలీసులు గుర్తించారు. మద్యానికి బానిసై, చేసిన బాకీలు అధిక వడ్డీలు చెల్లించలేక ఇంటిలో భార్యతో రోజు గొడవలు పడేవారు. భార్య తన ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వెళ్ళిపోయారు. దీంతో మనస్థాపం చెందిన చిరంజీవి ఇంటిలోనే చీరతో ఉరి వేసుకున్నాడు. గమనించిన బంధువులు హుటాహుటిన రుయా హాస్పిటల్ కు తరలించారు. చిరంజీవి వైద్యులు పరీక్షించిన అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. తిరుపతి రూరల్ ఎస్సై ఎస్ కే మూర్తి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.










