Oct 06,2023 12:49
  • రేపు రాత్రి 7 గం.లకు ఇళ్లలో లైట్లు ఆర్పి 5 నిమిషాల పాటు నిరనస 

ప్రజాశక్తి-మంగళగిరి : తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ, ఆయనకు మద్దతుగా రేపు “గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం” నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు శనివారం రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్లు ఆర్పి, ఇంటి బయట సెల్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగించి 5 నిమిషాల పాటు నిరసన తెలియజేయాలని కోరారు.. రోడ్డుపై ద్విచక్ర వాహనాలు, కార్లలో ఉంటే వాహన హెడ్ లైట్లు ఆన్, ఆఫ్ చేస్తూ నిరసన తెలపాలని విజ్ఞప్తి చేశారు. ‘మోత మోగిద్దాం’ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లుగానే “గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా భారత కాలమానం ప్రకారం ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.