మాట్లాడుతున్న మంత్రి కాకాణి
అత్యంత భక్తిశ్రద్దల నడుమ 'రంజాన్'
-పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
నెల్లూరు:పవిత్ర రంజాన్ మాసం ఆరంభం నుండి కఠోరమైన ఉపవాస దీక్షలు చేసి సంతోషాలు, ఆనందాల మధ్య రంజాన్ పండుగను జరుపుకుంటున్న ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. రంజాన్ పండగ సందర్భంగా శనివారం నగరంలోని బారాషహీద్ దర్గా లోని ఈద్గా వద్ద జరిగిన సామూహిక ప్రార్థనలలో రాష్ట్ర వ్యవసాయ సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి లతో కలసి పాల్గొన్నారు. ఈ సంధర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ, ఈ పవిత్ర రంజాన్ మాసం ఆరంభం నుండి ఉపవాస దీక్షలు, నియమనిష్ఠలతో, దైవ ప్రార్థనలు పూర్తి చేసుకొని నేడు (ఈదుల్ ఫిత్తర్) రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న ముస్లింల జీవితాల్లో ఆ అల్లా సంతోషాలు నింపాలని, వారు కోరుకున్నవన్నీ ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.రంజాన్ మాసంలోనే పవిత్ర గంధం ఖురాన్ ఆవిర్భవించిందన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా బారాషహీద్ దర్గా లో జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. ముఖ్యమంత్రి బారా షాహీద్ దర్గా అభివద్దికి ఏదైతే గతంలో ప్రభుత్వం జారీ చేసిన జిఓకు ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చిందన్నారు. అతి త్వరలోనే నిధులు కేటాయింపు జరుగుతుందని, జిల్లా కు సంబంధించి ముస్లీంల చిరకాలిక స్వప్నం నెరవేర్చేందుకు కషి చేయడం జరుగుతుందన్నారు. ముస్లీంల అభ్యున్నతికి, అభివద్దికి, వారి సంక్షేమం కోసం నిరంతరం కషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి అల్లా ఆశీస్సులు ఎల్లవేళలా వుండాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.










