May 08,2023 21:47

ఫొటో : వివరాలు వెల్లడిస్తున్న సిఐ గిరిబాబు

అత్యాచారయత్నం నిందితులు అరెస్ట్‌
ప్రజాశక్తి-ఉదయగిరి : మండల పరిధిలోని దాసరపల్లి సమీపంలో అత్యాచారయత్నానికి ప్రయత్నించిన నిందితులను సోమవారం స్థానిక పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు పంపునట్లు సిఐ గిరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. దాసరపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతూ నెల్లూరులోని ఓ ప్రయివేటు వైద్యశాలలో వైద్యం చేయించుకుని తిరుగు ప్రయాణంలో రాత్రి 10 గంటలకు ఉదయగిరి బస్టాండుకు చేరుకుంది.
బాధితురాలు తమ స్వగ్రామానికి వెళ్లేందుకు ఆటోను బాడుగకు మాట్లాడుకోగా ఆటో డ్రైవర్‌ సయ్యద్‌ రహీం తనను మరో ఆటో డ్రైవర్‌ షేక్‌ ఖాన్‌సాను ఎక్కించుకోని ఆమెతో దాసరిపల్లికి వెళుతుండగా మార్గం మధ్యలోని జామాయిల్‌ చెట్లల్లోకి ఆటోలు తీసుకుని వెళ్లి తనను బలత్కరించేందుకు ప్రయత్నించగా గట్టిగా కేకలు వేస్తూ బాధితురాలు రోడ్డుపైకి రావడంతో నిందితులు ఆటోతో పరారైనట్లు సిఐ తెలిపారు. ఎస్‌ఐ ఎన్‌.ప్రభాకర్‌ కేసు నమోదు చేసుకుని ఆటోను స్వాధీన పరుచుకుని నిందితులను కోర్టుకు హాజరు పరిచినట్లు తెలిపారు. సమావేశంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎన్‌.ప్రభాకర్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.