Jan 18,2023 21:04

మృతిచెందిన సుబ్బమ్మ

మృతిచెందిన సుబ్బమ్మ
అత్తను హతమార్చిన అల్లుడు..
కొడవలూరు:మద్యం సేవించేందుకు డబ్బులు ఇవ్వలేదని అత్తను హతమార్చిన అల్లుడు ఈ సంఘటన బుచ్చిరెడ్డిపాలెం వవ్వేరు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. వవ్వేరు గ్రామానికి చెందిన గద్దె సుబ్బమ్మ (70) ఒంటరిగా జీవనం సాగిస్తుండేది. దీన్ని గమనించిన అల్లుడు గుంటపల్లి నారాయణ మద్యానికి బానిసై తాగేందుకు అత్తను డబ్బులు అడగగా నా దగ్గర లేవు అని చెప్పడంతో మద్యం మత్తులో ఉన్న నారాయణ దగ్గరలో ఉన్న రోకలి బండతో ఆమె తలపై కొట్టాడు. దీంతో ఆమె అక్కడక్కడికే మతి చెందిం
ది. మృతురాలి ఒంటి పైన ఉన్న చెవిలో ఉన్న కమ్మలు, ఉంగరం తీసుకుని పరారయ్యాడు. కూతురినిచ్చిన పాపానికి అల్లుడు అత్తను హతమార్చి పరారవడంతో స్థానికులు తెలిపిన సమాచారం తో ఎస్సై వీర ప్రతాప్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.