Jan 15,2023 00:06

పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో సంక్రాంతి సంబ రాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్‌ శివ శంకర్‌ లోతేటి, ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శనివారం నరసరావుపేట పట్టణంలోని బ్రహ్మానంద రెడ్డి కాంప్లెక్స్‌ ఆవరణలో జరిగిన భోగి మంటలు, వేడుక కార్యక్రమంలో సంప్ర దాయ బద్ధంగా పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని డీ.ఎస్‌.ఏ స్టేడియంలో జరుగుతున్న వేడుకలకు ముఖ్య అతి థులుగా కలెక్టర్‌, ఎమ్మెల్యే హాజరయ్యారు. కార్యక్రమ నిర్వహణ సమన్వయకర్త, డి.ఆర్‌.డి.ఏ పి.డి బాలు నాయక్‌, పలువురు జిల్లా అధికారులు అతిథులకు పూర్ణ కుం భం తో స్వాగతం పలికారు. అక్కడ నుండి మేళ తాళాలు, హరిదాసులు, సన్నాయి మేళాలు, కనక తప్పట్లతో ప్రజలతో కలిసి ఊరేగింపుగా స్టేడియంలో కలియ తిరి గారు. డిఆర్డిఎ విభాగం, మెప్మా, బొమ్మల కొలువులు, వైద్య ఆరోగ్యశాఖ, ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ తదితర శాఖలు స్టాళ్లను ప్రారంభించి తిలకించారు. జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమాన్ని ప్రారంభించి, ఐసిడిఎస్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేసిన చిన్నారులకు భోగి పండ్లు పోసే కార్యక్రమంలో పాలొన్నారు. కార్యక్రమంలో భాగంగా గంగిరెద్దుల ఆటలు, మహిళల కోలాటం, బొమ్మల కొలువు, స్టాల్స్‌ ఎగ్జిబిషన్‌ సందర్శించి, ప్రజల్లో ఉత్సాహం నింపారు.
కార్యక్రమంలో వంటలు పోటీలు, ముగ్గుల పోటీలు, డి ఆర్‌ డి ఏ ప్రాజెక్ట్‌ ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్‌ ఎగ్జిబిషన్‌ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆయా శాఖల జిల్లా అధికారులు సంప్ర దాయ దుస్తులు వచ్చి, జిల్లా కలెక్టర్‌, నర్సాపేట నియోజకవర్గ శాసనసభ్యులకు స్వాగతం పలికారు. సంక్రాంతి సంబరాలు సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను చూపించు, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న కార్యక్రమాలను వివరించారు. వేడుకలకు పెద్ద ఎత్తున ప్రజల తల్లి రావడం ఆనందంగా ఉందని, ఆనందోత్సాహాల మధ్య సంక్రాంతి పండగను జరుపు ుకుంటున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ కుటుంబ సభ్యులు, జిల్లా రెవిన్యూ అధికారి వినాయకం, సం క్రాంతి సంబరాలు కార్యక్రమం నిర్వహణ సమన్వయకర్త బాలు నాయక్‌, ఉధ్యాన శాఖ అధికారి బి.జే.బెన్నీ, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి మురళి, ఐసిడిఎస్‌ ప్రాజెక్టు అధి కారులు, ఆయా శాఖల అధికారులు, మహి ళలు, చిన్నారులు, ప్రజలు పాల్గొన్నారు.