Mar 04,2023 21:05

సన్మానిస్తున్న దృశ్యం

సన్మానిస్తున్న దృశ్యం
అట్టహాసంగా లైన్‌మెన్‌ దినోత్సవ వేడుకలు
నెల్లూరు:విద్యుత్‌ భవన్‌ లోని స్కాడా బిల్డింగ్‌ లో లైన్‌ మెన్‌ దినోత్సవ వేడుకల ను అట్టహాసంగా నిర్వహించారు. శనివారం నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్యఅతిధిగా నగర ఏఈ ఏ. సోమశేఖర్‌ రెడ్డి , పర్యవేక్షణా ఇంజనీర్‌ బి.వెంకటసుబ్బయ్యలు హాజరైయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్థ కు ఓఅండ్‌ ఎమ్‌(ఆపరేషన్‌ అండ్‌ మెయింటెన్స్‌) సిబ్బంది కీలక పాత్ర పోషిస్తారన్నారు. ప్రతి సంవత్సరం జాతీయ భద్రతా వారోత్సవాలలో భాగంగా మొదటి రోజు మార్చి 4 వ తేదీని లైన్‌ మెన్‌ దినోత్సవం గా పరిగణించబడుతుందన్నారు. విద్యుత్‌ సిబ్బంది ఉద్యోగం చాల జాగ్రత్తగా చేయాలని ప్రమాదాలు నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఒక బ్రేక్‌ డౌన్‌ వచ్చింది అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మంచి ఫలితాలు సొంతం చేసుకోవచ్చున్నారు. ఉద్యోగి తన విధుల పట్ల అంకితభావంతో వ్యవహరిస్తే వారి కుటుంబ వ్యవస్థ కూడ చక్కగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యుత్‌ సిబ్బంది ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ అని తెలిపారు.

ఈ సంధర్భంగా టౌన్‌ డివిజన్‌ లోని 11 సెక్షన్‌ లలో ఒక్కొక సెక్షన్‌ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఒకరికి ఉత్తమ సేవా పురస్కారం అందజేశారు. ఏ. కె.నగర్‌ సెక్షన్‌ నుండి బి.జగదీష్‌, బి.వి.నగర్‌ సెక్షన్‌ నుండి ఐ. వి.రెడ్డి, ఐ. ఈ. సెక్షన్‌ నుండి పెంచల కిరణ్‌ ,టౌన్‌ హాల్‌ సెక్షన్‌ నుండి ఎన్‌ హరి , ఈస్ట్‌-1 సెక్షన్‌ నుంచి ఎం సునీల్‌ కుమార్‌, ఈస్ట్‌-2 సెక్షన్‌ నుంచి వి.వి. సుబ్బారావు గారు , స్టోన్‌ హౌస్‌ పేట సెక్షన్‌ నుంచి షేక్‌ లతీఫ్‌, హరినాధపురం సెక్షన్‌ నుంచి ఏడుకొండలు , వెస్ట్‌-1సెక్షన్‌ నుండి డి నాగరాజు ,వెస్ట్‌ -2 సెక్షన్‌ నుంచి ఎస్‌ శ్రీనివాసులు, వెస్ట్‌-3 సెక్షన్‌ నుంచి షేక్‌. మస్తాన్‌ లకు ఉత్తమ సేవా పుష్కరాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్స్‌ శ్రీధర్‌, మధుసూదన్‌ రెడ్డి , కిరణ్‌ డివిజన్లోని అసిస్టెంట్‌ ఇంజనీర్స్‌ ,సిబ్బంది పాల్గొన్నారు.