మాట్లాడుతున్న కలెక్టర్
అట్రాసిటి చట్టం అమలుకు పటిష్ట చర్యలు
నెల్లూరు:జిల్లాలో ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టం పకడ్బందీగా అమలు చేయడంతో పాటు, ఆయా వర్గాలపై జరుగుతున్న దాడులకు సంబంధించి నమోదైన కేసులను సత్వరమే పరిష్కరించి బాధిత కుటుంబాలకు న్యాయం అందించగలిగే విధంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ కె.వి.ఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు.శనివారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టరు జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ (ఎస్.సి., ఎస్.టి. అత్యాచార నిరోధక చట్టం) సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎస్‌పి సిహెచ్ విజయరావు, ఎంఎల్‌సి బల్లి కళ్యాణ చక్రవర్తితో కలిసి జిల్లాలో ఎస్.సి., ఎస్.టి. అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులను డివిజన్ల వారీగా వారీగా సమీక్షించారు. ఈ కేసుల పరిష్కారంపై ప్రత్యేకంగా దష్టి సారించి, బాధిత కుటుంబాలకు న్యాయం అందించగలిగే విధంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తున్నామన్నారు. జిల్లా జనాభాలో 32 శాతం ఎస్.సి. ఎస్.టి జనాభా వున్నారని, వారికి రాజ్యాంగ పరంగా కల్పించిన హక్కులు, బాధ్యతలను పరిరక్షించడంతో పాటు వారి సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ద కనపరచాలన్నారు. జిల్లాలో నవరత్నాల కార్యక్రమంలో భాగంగా సచివాలయ, వాలంటీర వ్యవస్థ ద్వారా బడుగు, బలహీన వర్గాల ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తున్నామన్నారు. జిల్లాలో ఎస్‌సి,ఎస్‌టి అట్రాసిటీ చట్టం పకడ్బందీగా అమలు చేయడంతో పాటు, వారిపై జరుగుతున్న దాడులకు సంబంధించి నమోదైన కేసులను సత్వరమే పరిష్కరించి బాధిత కుటుంబాలకు న్యాయం అందించగలిగే విధంగా అధికారులు పనిచేయాలని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లో కేసులు నమోదులో జాప్యం ఉండకూడదని, కేసు నమోదుకు అవసరమైన ధవపత్రాలు వెంటనే భాదితులకు అధికారులు అందజేయాలన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా పారదర్శకంగా విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎస్‌సి,ఎస్‌టి వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా అధికారుల దష్టికి తీసుకు రావాలన్నారు. జిల్లాలో రెవెన్యూ, పోలీసు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎస్‌సి,ఎస్‌టి అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యంగా ఆయా వర్గాలకు సంబంధించిన కుల ధ్రువీకరణ పత్రాలు జాప్యం చేయకుండా జారీ చేయాలన్నారు. అలాగే బాధితులకు త్వరితగతిన నష్టపరిహారాన్ని చెల్లించాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎస్‌సి,ఎస్‌టి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. అత్యాచార చట్టం క్రింద నమోదు చేసిన కేసుల పరిష్కారంపై ప్రత్యేకంగా దష్టి సారించాలని ఆదేశించారు. బాధితులకు తక్షణమే పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల వారీగా సమీక్షించి, ఎస్‌సి, ఎస్‌టి కాలనీలకు రోడ్లు, త్రాగునీటి సమస్య, నివేశన స్థలాల పంపిణీ, ఇల్లు మంజూరు తదితర సమస్యలను సత్వరం పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అట్రాసిటీ కేసుల పరిష్కారంపైనా, సివిల్ రైట్స్ డే నిర్వహణ పైనా ప్రత్యేకంగా దష్టి పెట్టాలని డివిజనల్ అధికారులకు సూచించారు. ఈ సంధర్బంగా కమిటీ సభ్యులు జిల్లాలో ఎస్‌సి, ఎస్‌టి లపై జరిగిన దాడులు గురించి పలు సమస్యలను అధికారుల దష్టికి తీసుకువచ్చి, సత్వరం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. జిల్లాలోని ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో ఎస్.సి., ఎస్.టి. అత్యాచార నిరోధక చట్టం పై ప్రజలకు ఆవగాహన కలిగే విధంగా బ్యానర్లను, వాల్ పోస్టర్స్ ను ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులు, అధికారుల దష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, సోషల్ వెల్ఫేర్ డిడి వెంకటయ్య, నెల్లూరు, కావలి, ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారులు మాలోల, శీనా నాయక్, కరుణకుమారి, కమిటీ సభ్యులు కె. రఘు, శేషం సుదర్శనం, పి. సుబ్బరాయుడు, కె.సి.పెంచలయ్య, డి. ప్రసన్న గణపతి, ఖాజారసూల్, ఏం. సురేంద్ర రెడ్డి, సాయి ప్రసాద్, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.










