Mar 26,2023 22:19

లోకేష్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఆటో కార్మికులు

పుట్టపర్తి రూరల్‌: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాదయాత్రకు పుట్టపర్తి ఆటో కార్మికులు తమ సంఘీభావం తెలిపారు. ఆదివారం ఓడిసి మండలంలోని గౌనిపల్లి సమీపంలో పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు.పుట్టపర్తి ఆటో కార్మికుల సమస్యలను ఆయనకు తెలపడానికి వచ్చిన ఆటో కార్మికులు తాము పడుతున్న కష్టాలను వివరించారు. ఆటో కూడా కొనలేని నిరుపేద డ్రైవర్లు చాలామంది ఉన్నారని ప్రత్యేకంగా ఆటో కార్మికులకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్‌ నాయకులు గాజుల రామాంజనేయులు, షామీర్‌, శేషు, యాసీన్‌తో పాటు ఆటో కార్మికులు పాల్గొన్నారు.