Mar 26,2023 22:22

ప్రతిభా విద్యార్థులతో పాఠశాల హెచ్‌ఎం ప్రసాద్‌

ప్రజాశక్తి-హిందూపురం : ఆత్మరక్షణ విద్య అందరికి అవసరమని ఎల్‌ఆర్‌జి ప్రిన్సిపల్‌ ప్రసాద్‌ పేర్కోన్నారు. హిందూపురం రూరల్‌ మండలం ఎల్‌ఆర్‌జి పాఠశాలలో కరాటే మాస్టార్‌ రఫీక్‌ ఆహ్మాద్‌ ఆధ్వర్యంలో కరాటే విద్యార్థులకు బెల్టు పరీక్షలు ఆదివారం నిర్వహించారు. ఈ పరీక్షలో 65 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు వివిధ బెల్టులను బహుకరించి అభినందించారు. ఈ సందర్బంగా ప్రసాద్‌, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రతాప్‌రెడ్డి, ఎఒ సంజీవరెడ్డి మాట్లాడుతు ప్రతి విద్యార్థికి ఆత్మరక్షణ విద్య అవసరమన్నారు. ముఖ్యంగా బాలికలకు ఈ విద్య ఎంతోగానో ఉపయోగపడుతుందని తెలిపారు. దీన్ని దృష్టిలో వుంచుకొని పాఠశాలలో కరాటే కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. కరాటే విద్యతో పాటు పాఠశాలలో వ్యాయమ విద్యకు సైతం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా రియాజ్‌బాషా, లక్ష్మినారాయణ, ప్రవీణ్‌కుమార్‌, శివరాజ్‌, హరి వ్యహరించారు. ఈ కార్యక్రమంలో కటాటే మాస్టర్లు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.