పీలేరు : ఆదివారం పీలేరు పట్టణ శివారులోని ఎంఎం ఫంక్షన్ హాల్‌లో ఇటీవల పార్టీ పదవులు పొందిన ఆరుగురు నాయకుల కోసం అభినందన సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధ్యక్షులుగా ఎంపికైన డాక్టర్ షేక్ హబీబ్‌బాష, వైసిపి జిల్లా అధ్యక్షులు సి. చిన్న ఎల్లప్ప, జిల్లా మహిళా అధ్యక్షురాలు కె. మహత ఆనంద్, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు ఆనంద రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ విభాగ అధ్యక్షులు ఎం. రవీంద్ర, జిల్లా వికలాంగుల విభాగం అధ్యక్షులు రెడ్డప్పను ఎమ్మెల్యే, ఇతర నాయకులు అభినందించి, సన్మానించి, సత్కరించారు. కార్యక్రమంలో పీలేరు మాజీ ఎమ్మెల్యే జీవి శ్రీనాథ్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఇగ్బాల్ అహ్మద్ ఖాన్, డిసిసిబి డైరెక్టర్ హరీష్ రెడ్డి, జడ్పిటిసి ఏటి రత్నశేఖర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.










