రాయచోటి : అతిసార నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, మంగళవారం నుంచి 17 వరకు జిల్లాలో ఉధత అతిసార నియంత్రణపై ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేసి అతిసారను అరికట్టాలని కలెక్టర్ గిరీష వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఉధత అతిసార నియంత్రణ కార్యక్రమాలపై వైద్యారోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయన మాట్లాడుతూ జిల్లాలో అతిసార వ్యాధి అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అతిసారం వల్ల విరేచ నాలు ఎక్కువ అయి బలహీనపడతారని, విరోచనాల నివారణలో ఓఆర్‌ఎస్, జింక్ వాడకంపై విస్తతంగా అవగాహన కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. పిల్లలకు విరోచనాలు అవుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఆశ, ఎఎన్‌ఎంల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. ఓఆర్‌ఎస్, జింక్ మాత్రలు సమీపంలోని ఆరోగ్య కార్యకర్త వద్ద ఉచితంగా లభిస్తాయన్న విష యాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఓఆర్‌ఎస్ కలిపిన తర్వాత 24 గంటల్లోపు దాన్ని ఉపయోగించాల్సి ఉంటుందని బిడ్డకు విరేచనాలు అయిన ప్రతిసారి క్రమం తప్పకుండా ఓఆర్‌ఎస్‌ను తాపాలన్నారు. విరేచనాలు తగ్గినప్పటికీ 14 రోజుల వరకు జింకు మాత్రలు వాడాల్సి ఉంటుందని ఆ సమ యంలో బిడ్డకు తల్లిపాలు తప్పనిసరిగా పట్టించాలని ఈ విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.జిల్లాలో ఎన్‌సిడిసిిడి సర్వే లక్ష్యాలను పూర్తి చేయాలని, రక్తహీనతలతో బాధపడుతున్న వారిని గుర్తించి ఎప్పటికప్పుడు రక్త పరీక్ష నిర్వహించి వారిలో రక్తం మెరుగుదల అయ్యేందుకు క షి చేయా లన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ లో ఇంటి వద్ద వైద్య సేవలు అందించ డంతోపాటు డయాబెటిస్ హైపర్ టెన్షన్ రోగులకు తరచు వైద్య పరీక్షలు నిర్వహించాలని హాస్పిటల్స్ లో జనరల్ ఓపీ సంఖ్యను మరింత పెంచాలన్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి వివిధ అంశాలలో సమీక్షించి పలు సూచనలు జారీ చేశారు. సమీక్షలో డిఎంహెచ్‌ఓ డాక్టర్ కొండయ్య, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.










