Jan 03,2023 21:34

మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ ప్రసన్న

మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ ప్రసన్న
ఆస్తులు పంచిన చరిత్ర నల్లపరెడ్డిదే
కోవూరు :తాతలు నాటి నుంచి తమ కుటుంబం జమిందారుగా గుర్తింపు పొంది, పేదలకు ఆస్తులు పంచిన ఘనత, నల్లపరెడ్డికె దక్కిందని ఎంఎల్‌ఎ ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు.కోవూరు లో మంగళవారం జరిగిన గడప గడప కార్యక్రమంలో ఈసందర్బంగా మాట్లాడుతూ,బార్లో, ఇసుక మాఫియాలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో తాను అవినీతికి పాల్పడితే, ఇన్ని ఆస్తులు ఎలా పెరిగాయి, నా ఆస్తులు ఎంత అనే చర్చలో తేల్చు కుందాం చంద్రబాబు అంటూ ప్రసన్న సవాల్‌ చేశారు. రంగా రెడ్డి జిల్లాలో తన వియ్యంకుడు, కుమారుడు కు లోను పెట్టి ఇల్లు కట్టిస్తుంటే, అవినీతి సొమ్ముతో ప్యాలెస్‌ నిర్మిస్తున్నవని తమపై విమర్శలు చేయడం సరి కాదన్నారు, నీకు దమ్ముంటే తేల్చు కుందాం అని మండి పడ్డారు. తమ తాతలు ఆస్తులు వేల ఎకరాలు ఉండేదని ఇవన్నీ ప్రజలు కోసం, పోగుట్టుకున్నామే తప్ప, నీచమైన సంస్కతి మాది కాదు అని హెచ్చరించారు. ఈరోజు ప్రజల పక్షాన నిలబడి సేవ చేసే కుటుంబం అని అన్నారు.

జగన్‌ సర్కార్‌ ప్రజలు సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నవరత్నాలు పథకం ద్వారా పలు రకాలు స్కీంలను ప్రభుత్వం ఈరోజుకి 62లక్షల 75వేల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. చంద్రబాబు లాగా, మాయ మాటలతో ప్రజలను మభ్య పెట్టి, జన్మ భూమి ద్వారా, నియంత పాలన సాగించిన ఘనత బాబు కె దక్కిందన్నారు.కార్యక్రమం లో దొడ్డం రెడ్డి నిరంజన్‌ బాబు రెడ్డి, పచ్చి పాల రాధా కష్ణా రెడ్డి, జెడ్‌పిటిసి శ్రీలత, ఎంపీపీ పార్వతి, వైస్‌ ఎంపీపీ శివుని నరసింహులు రెడ్డి, కాటం రెడ్డి దినేష్‌ రెడ్డి. ఎమ్మెల్యే సోదరులు, రాజేంద్ర కుమార్‌ రెడ్డి, తనయులు, రజిత్‌ కుమార్‌ రెడ్డి, రోహిన్‌ రెడ్డి, ఎంపిడిఒ శ్రీహరి, పీడీ, సాంబశివరావు, తహశీల్దార్‌ పద్మజ, కన్వీనర్‌ సుబ్బారెడ్డి, తదితరులు, రైతులు పాల్గొన్నారు.