Jul 12,2021 15:55

ఆస్ట్రేలియా : కరోనా వైరస్‌ అంతర్జాతీయ క్రికెటర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ పీటర్‌ హాండ్స్‌ కాంబ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్‌లో హాండ్స్‌ కాంబ్‌ ఆడుతున్నాడు. అక్కడే ఆయన కరోనా బారిన పడ్డాడు. ఇంగ్లాండ్‌ క్రికెటర్లలో కూడా ఇప్పటికే ముగ్గురు కరోనాతో బాధపడుతున్నారు. వీరితో పాటు మరో నలుగురు సహాయ సిబ్బందికి కూడా కరోనా సోకింది. హాండ్స్‌ కాంబ్‌ కౌంటీల్లో మిడిలెసెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయనకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఛాంపియన్‌షిప్‌ రెండో గ్రూప్‌ మ్యాచుకు దూరమయ్యాడు. హాండ్స్‌ కాంబ్‌ స్థానంలో ఐరిష్‌ ఆటగాడు టిమ్‌ ముర్తగ్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. హాండ్స్‌ కాంబ్‌ ఫామ్‌లో లేకపోవడంతో ఆసీస్‌ జట్టుకు ఎంపిక కాలేకపోతున్నాడు. 2019 జనవరిలో ఇండియాతో జరిగిన మ్యాచులో చివరి టెస్ట్‌ ఆడాడు. 2019 ఫిబ్రవరిలో ఇండియాతో జరిగిన సిరీస్‌లో చివరి టీ20 ఆడాడు.