మాట్లాడుతున్న కమిషనర్ హరిత
ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
నెల్లూరు:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జి. ఓ. ఎం. యస్. నెం. 34 ఎం. ఏ. తేది. 16-03-2023 ఉత్తర్వుల మేరకు రాష్ట్రం లో అన్ని నగరపాలక, పురపాలక సంఘాలలో ఆస్థి, ఖాళీ స్థలం పన్నులపై ఈ ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న బకాయిలపై విధించిన వడ్డీని వన్ టైమ్ మెజర్ మాఫీ చేయడం జరిగిందని కమిషనర్ హరిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పన్ను చెల్లించవలసిన చెల్లింపుదారులు బకాయి ఉన్న మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరంతో సహా ఒకేసారి 31వ తేదిలోగా చెల్లించే సందర్భంలో ఈ వడ్డీ మినహాయింపు వర్తిస్తుందన్నారు. నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్తి పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, వడ్డీ మినహాయింపు లబ్దిని పొందాలని,ఆస్తి (పి.టి) ఖాళీ స్థలం పన్ను (విఎల్‌టి) బకాయిలను వడ్డీ లేకుండా ఒకే విడతలో చెల్లించవచ్చున్నారు. కార్పోరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలోకాని, నగరంలో ఏర్పాటు చేసిన ఆస్తిపన్ను వసూళ్ల ప్రత్యేక కౌంటర్లలో చెల్లింపులు చేయవచ్చన్నారు. అదే విధంగా పన్నులను ఆన్-లైన్ లో (ష్ట్ర్‌్‌జూర://షసఎa.aజూ.స్త్రశీఙ.ఱఅ) నెట్-బ్యాంకింగ్ ద్వారానూ, డెబిట్ / క్రెడిట్ కార్డుల ద్వారానూ,ద్వారా, సంబంధిత వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శి ద్వారా అయినా చెల్లించవచ్చని వెల్లడించారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నగరాభివద్ధికి తోడ్పడవలసినదిగా కోరారు.










