- జగనన్న ఆసరా చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చింతల.
ప్రజాశక్తి-కలకడ: మహిళలు మహారాణులుగా ఎదగాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయంగా పెట్టుకున్నారని పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు చింతల రామచంద్ర రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని బాటవారి పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు నందు నిర్వహించిన వైయస్సార్ ఆసరా చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న మహిళలు అన్ని రంగాలలో రాణించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి మహిళలకు ఎనలేని ప్రాముఖ్యతను ఇస్తున్నారని తెలియజేశారు. ప్రతి మహిళ ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చందాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు.ఈ విషయాన్ని మహిళలు గుర్తించాలని కోరారు.రానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రి ప్రజలకు చేస్తున్న సేవలను గుర్తించి ఓట్లు వేయడం జరుగుతుందని ఎంపీపీ శ్రీదేవి రవికుమార్ తెలియజేశారు.స్థానికంగా ఉన్న నాయకులపై కొద్దో గొప్పో కోపమా ఉన్నప్పటికిని జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బరకం రవికుమార్ రెడ్డి మహిళలను కోరారు. వైయస్సార్ ఆసరా కింద రూ. 6,20,41,753, వైయస్సార్ సున్నా వడ్డీ కింద 2021 22 సంవత్సరానికి గాను రూ. 5,12,00,000. జగనన్న తోడు పథకం ద్వారా 613 మందికి రూ. 61,30, 000. బ్యాంకు లింకేజీ ద్వారా 257 గ్రూపులకు రూ. 30,53,57,000. శ్రీనిధి పథకము ద్వారా 905 మందికి రూ. 2,80,00,000. మరియు ఉన్నతి పథకం ద్వారా 152 మందికి రూ. 76,76,020లను చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి, ఎంపీటీసీ కృష్ణారెడ్డి ,చైర్మన్ కమలాకర్ రెడ్డి, నాయకులు మోహన్ రాజనాయుడు, సురేష్ నాయక్, శావత్ అలీ ఖాన్, ఈ నయా తుల్లా ,వట్టం మధుసూదన్










