రోగులకు పండ్లు పంచుతున్న జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్‌నాధ్‌రెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి మంగళవారం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి పేద ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతుంటారని తెలిపారు. రాష్ట్రాన్ని సంక్షేమ ఆంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులురెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎం.జనార్దన్‌రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు, కౌన్సిలర్లు, ప్రభుత్వ వైద్యాధికారులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










