ఆస్పతి అభివృద్ధి కమిటీ సమావేశం
ప్రజాశక్తి మర్రిపాడు : స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గంగవరపు లక్ష్మీదేవి అధ్యక్షతన బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్యసిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ వైద్యానికి వచ్చే రోగులను నిర్లక్ష్యం చేయకుండా చికిత్స అందించాలన్నారు. ప్రభుత్వాసుపత్రిలో నమ్మకం కలిగేలా వైద్య సేవలందించాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రుల ద్వారా రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆసుపత్రిలో ఆపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని వైద్య సిబ్బంది కోరారు. అనంతరం ఎంపిడిఒ, వైద్యాధికారితో కలిసి వార్డు రూములన పరిశీలించి ఆసుపత్రిలో అందే సౌకర్యాలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఎంపిపి లక్ష్మీదేవి, చిలకపాడు సర్పంచ్ రమాదేవి, మాజీ కన్వీనర్ శ్రీనివాసులు నాయుడును ఆసుపత్రి సిబ్బంది శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ నాగమణి, వైద్యాధికారి డాక్టర్ కల్పన, వైసిపి నాయకులు మోహన్‌రెడ్డి, ఆరోగ్య విస్తరణ అధికారి కొండారెడ్డి, సూపర్‌వైజర్ సైదా, సిబ్బంది పాల్గొన్నారు.










