ఫొటో : మాట్లాడుతున్న కమిషనర్ నాగేశ్వరరావు
అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయాలి
ప్రజాశక్తి-ఆత్మకూర్ అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ బి.నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో సచివాలయం సిబ్బంది. వాలంటీర్లతో హౌసింగ్ సంబంధిత సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇలా నిర్మాణం ఇంకా అసంపూర్తిగా ఉన్న ఇళ్లను త్వరగా పూర్తిచేయాలని అధికారులను, సచివాలయ సిబ్బందిని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో హౌసింగ్ డి.ఇ.నటరాజ్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్, మున్సిపల్ ఆర్‌ఐ ఖాసీం, మెప్మాసిబ్బంది అంకయ్య, మాధవి, అలీ బేగ్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.










