Apr 05,2023 21:33

నివాళులర్పిస్తున్న మంత్రి కాకాణి

నివాళులర్పిస్తున్న మంత్రి కాకాణి
అసమానతలు రూపుమాపిన మహోన్నతుడు
నెల్లూరు:సమాజంలో అసమానతలు రూపుమాపి, ప్రతి ఒక్కరూ సమైక్యంగా జీవించాలనే లక్ష్యంతో సమాజాభివద్ధికి అహర్నిశలు కషి చేసిన గొప్ప దార్శనికుడు, మానవతావాది డాక్టర్‌ బాబు జగ్జీవన్‌ రామ్‌ అని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘసంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతిని పురస్కరించుకొని వేదాయపాలెం కూడలిలోని ఆయన విగ్రహానికి ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, జడ్పీ చైర్‌ పర్సన్‌ ఆనం అరుణమ్మ, జాయింట్‌ కలెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ తో కలిసి మంత్రి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ మంత్రివర్గంలో అత్యంత చిన్న వయసులోనే స్థానం సంపాదించుకొని, భారతదేశానికి విశేష సేవలు అందించిన వారిలో అగ్రగణ్యుడు బాబు జగజ్జీవన్‌ రామ్‌ అన్నారు. దేశానికి ఉప ప్రధానిగా, అణగారిన వర్గాల ఆశాజ్యోతి గా ఆయన సేవలు చిరస్మరణీయమని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలోని ప్రజలందరూ కలిసిమెలిసి ఎటువంటి అంతరాలు లేకుండా జీవించేందుకు జగ్జీవన్‌ రామ్‌ చేసిన కషి మరువలేనిదన్నారు.
ప్రతి ఒక్కరు కూడా ఆ మహనీయుని అడుగుజాడల్లో పయనించి ఆయన ఆశయ సాధనకు కషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల కోసం కషి చేసిన గొప్ప మానవతావాది జగ్జీవన్‌ రామ్‌ అని, ఆయన జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. జడ్పీ చైర్పర్సన్‌ శ్రీమతి ఆనం అరుణమ్మ మాట్లాడుతూ ఉప ప్రధానిగా జగ్జీవన్‌ రామ్‌ దేశానికి ఎంతో సేవ చేశారని, ఆయనను స్మరించుకోవడం మనందరి బాధ్యతగా గుర్తెరగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి యిమ్మానురి వెంకటయ్య, ఆర్డిఓ మలోల, ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు కేసి పెంచలయ్య, కుడుముల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.