May 22,2023 21:07

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సురేష్‌

పండ్లతోటల పరిహారంపై వాగ్వాదం
పారదర్శకంగా అసైన్‌మెంట్‌ కమిటీలు : ఇన్‌ఛార్జి మంత్రి
ఆక్రమణలు పెచ్చుమీరిన గ్రామాల్లో స్పెషల్‌డ్రైవ్‌ : కలెక్టర్‌
పులివెందుల పాఠశాలల్లో మౌలిక వసతులపై నిలదీత
అన్నమయ్య నిర్వాసితులను ఆదుకోవాలి: ఎంఎల్‌సి
ప్రజాశక్తి - కడప ప్రతినిధి : సైన్డ్‌ భూముల పందేరంపై జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమా వేశం గరంగరంగా నడిచింది. జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ ఆకేపాటి అమర నాథరెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని 10 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల్లో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి, బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ, ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, పి.రామ సుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, రామగోపాల్‌రెడ్డి మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎంపీలు గైర్హాజరు కావడం గమనార్హం. దీంతో జిల్లా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల ప్రస్తావన మొక్కుబడిగానే సాగిం దని చెప్పుకోవచ్చు. జిల్లాకు వ్యవసాయమే ప్రాణాధారం. ఇంతటి ప్రాధాన్యత కలి గిన రంగానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వలేదనే చెప్పవచ్చు. 10 రోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. పంటల సాగుకు విత్త నాలు, ఎరువులు, పురుగు మందుల లభ్యత, సరఫరా వంటి అం శాలపై లోతుగా చర్చించాల్సి ఉంది. టిడిపి ఎంఎల్‌సి రామ గోపాల్‌రెడ్డి, ఎంఎల్‌ఏ రవీంద్రనాధరెడ్డి పంటల బీమా, అకాల వర్షం భారిన పడిన పండ్లతోటల నష్టపరిహారం విషయంలో వాగ్వా దం మినహా ఎటువంటి లోతైన చర్చను చేపట్టకపోవడం విస్మ యాన్ని కలిగించింది. ఎమ్మెల్సీ స్పందించి ఆదివారం సాయంత్రం కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షానికి దెబ్బతిన్న పండ్ల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, సత్వరమే పరిహారాన్ని అందిం చాలని ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన కింద విత్తనం వెంటనే నష్టం వాటిల్లితే 25 శాతం పరిహారం లభించే అవకాశం ఉందని, వైఎస్‌ఆర్‌ పంటల బీమా పథకం అమలుతో అటువంటి అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. టెన్త్‌, ఇంటర్‌ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉత్తీర్ణతశాతం అద్వా నంగా ఉండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నాడూ-నేడు పథకం గురించి గొప్పలు చెబుతున్నారని, పులివెందులకు చెందిన పాఠ శాలలో మూడు దశల నాడూ-నేడు మౌలిక వసతులు కల్పించడం లోనే డొల్లతనం వెల్లడవుతోందని విమర్శించారు. దీనికి ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌ జోక్యం చేసుకుని ఎమ్మెల్సీ సూచించిన సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ నిచ్చారు. బి. మఠంలోని జూనియర్‌ కళాశాలను ఎల్‌ఎస్‌పి దగ్గర ఏర్పాటు చేయ డం ద్వారా 40 మంది విద్యార్థులకు భారంగా మారిందని, జూని యర్‌ కళాశాలను మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని బి.మఠం జడ్‌పిటిసి వివరించారు. దీనికి కలెక్టర్‌ విజయరామరాజు స్పందించి గతంలో ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో మార్చాల్సి వచ్చిందని, ఇటువంటి ఘటనలు పునరావృతం గాకుండా చూస్తా మని హామీనిస్తే పునరుద్ధరించే ప్రయత్నం చేస్తామన్నారు. అనంతరం అసైన్‌మెంట్‌ కమిటీల్లో అర్హులకు తగిన స్థానం దక్కలేదని, 419 మంది అర్హుల పేర్లను పరిశీలించాలని చక్రాయపేట జడ్‌పిటిసి సభ దృష్టికి తీసుకొచ్చారు. బి.మఠం ఎంపిపి, జడ్‌పిటిసిలు స్పందించి తమ మండలంలోనూ ఇటువంటి ఘటనలు పెచ్చుమీరాయని, అసైన్‌మెంట్‌ కమిటీని రద్దు చేయాలని, టిడిపి హయాంలో ఒక్కో ఇంట్లో పిల్లల పేర్లతో కలిపి 20 ఎకరాలను ఇచ్చారని, ఇటువంటి వాటిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. వీరితోపాటు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి స్పందించి తమ అసెంబ్లీ పరిధిలోని వీరపునాయునిపల్లి మండలంలోనూ ఇటువంటి అక్రమ ణలు ఉన్నాయని సభ దృష్టికి తెచ్చారు. దీనికి కలెక్టర్‌ జోక్యం చేసు కుని బి.మఠం, వీరపునాయునిపల్లి మండలాల నుంచే ఎక్కువగా భూ ఆక్రమణలపై ఫిర్యాదులు వస్తున్నాయని, భూసమస్యల పరిష్కా రానికి స్పెషల్‌ డ్రైవ్‌ను ఏర్పాటు చేసి పరిష్కరించే ప్రయత్నం చేస్తా మని, దీంతోపాటు నియో జకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాల్ని ఏర్పాటు చేసి సుమారు 28 వేల చుక్కల భూముల అర్హత పత్రాలను అంద జేస్తామని హామీనిచ్చారు. ఆర్‌బికె సెంటర్లలో సోషల్‌ ఆడిట్‌కు ఉం చుతామని తెలిపారు. దీనికిపై ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పందించి అసైన్‌ మెంట్‌ కమిటీలను పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. భూమి మీద ఉన్న వారికే యాజమాన్య హక్కులు వస్తా యని చెప్పారు. భూముల సాగుకు సంబంధించిన పైపులు, పం పులు, పట్టల కాంట్రాక్టును జిల్లాలోని ఆరు కంపెనీలను కాదని, ఆళ్ల గడ్డకు చెందిన వికె ఆగ్రో సంస్థ నాసిరకమైన కంపెనీ అని, కాంట్రా క్టును రద్దు చేసి నాణ్యమైన కంపెనీకి ఇవ్వాలని విఎన్‌పల్లి జడ్‌పిటిసి డిమాండ్‌ చేశారు. దీనికి డ్వామా పీడీ స్పందించి నాణ్యమైన ఉత్ప త్తులను అందించే ఏర్పాట్లు చేస్తామని హామీనిచ్చారు. అనంతరం కలెక్టర్‌ జోక్యం చేసుకుని జిల్లా ఆడిట్‌ టీమ్‌ ద్వారా నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీపడకుండా చూడాలని ఆదేశించడం గమనార్హం.