ప్రజాశక్తి-మైలవరం
గ్రామీణ పేదల్లో వలసలు నివారించటానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామసభల ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేసి అసైన్డ్ కమిటీ ద్వారా భూ పంపిణీ అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోట కల్యాణ్ డిమాండ్ చేశారు. మండలంలోని వెల్వడం గ్రామంలోని ఎస్సీ కమ్యూనీటి హాలులో ఆదివారం వ్యవసాయ కార్మికసంఘం మండల మహాసభ లంకా వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరాలు గడుస్తున్న పేదలకు భూపంపిణీ జరగడం లేదన్నారు. ప్రభుత్వ భూములు అనర్హుల చేతుల్లో ఉన్నాయని వాటిని స్వాదీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు పేదల భూములకు రక్షణ కల్పించాలని, భూసిలింగ్ 9/77 అసైన్డ్‌మెంట్ 2013 భూ సేకరణ అటవీ హక్కుల చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. కోనేరు రంగారావు భూ కమిటీ సిపార్సుల మేరకు భూమిలేని ప్రతి కుటుంబానికి మూడు ఎకరాలు ఇవ్వాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పానెం అనందరావు మాట్లాడుతూ నవరత్నాల పథకాల్లో భూ పంపిణీ చేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం 9 మంది తో కూడిన నూతన కమిటీని ఎన్నుకున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం మైలవరం కార్యదర్శిగా ప్రతిపాటి నాగేశ్వరరావు, అధ్యక్షుడుగా లంకా వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి కోట సురేష్‌లను ఎన్నుకున్నారు. ఈకార్యక్రమంలో సంఘం సినియర్ నాయకులు రావురి రామరావు, మందాస్వామి, సంది పాము ఇస్సాక్ పాల్గొన్నారు.










