Jun 06,2023 20:21

ఫొటో : మాట్లాడుతున్న సిఐటియు మండల కార్యదర్శి అన్వర్‌బాషా

ఆశావర్కర్లకు రూ.26వేలు ఇవ్వాలి
ప్రజాశక్తి-అనంతసాగరం : ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, పనిభారం తగ్గించాలని సిఐటియు మండల కార్యదర్శి అన్వర్‌ బాషా డిమాండ్‌ చేశారు. ఆయన ఆధ్వర్యంలో మంగళవారం మండలంలో ఆశా వర్కర్లకు సిఐటియు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘానికి బలం సభ్యత్వం, కావున ప్రతిఒక్క ఆశ వర్కర్‌ సిఐటియు సంఘంలో సభ్యులుగా చేరాలన్నారు.
ఆశా వర్కర్ల హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక సంఘం సిఐటియు అని తెలియజేశారు. ప్రభుత్వాలు ఆశ వర్కర్లమీద విపరీతమైన పనిభారం పెంచి శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఆశ వర్కర్స్‌ యూనియన్‌ నాయకురాలు ప్రమీల, ధనమ్మ, జ్యోతి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.