Dec 14,2022 22:32

డాక్టర్‌ను నిలదీస్తున్న వైసిపి నాయకులు

చిలమత్తూరు : ఆశా వర్కర్ల నియామకాలను ప్రకటించిన అధికారులు అంతలోనే ఆ ప్రకటన రద్దు చేశామని ప్రకటించారు. నియామకాలను ప్రకటించిన కొద్ది సేపటికే దీనికి రాజకీయ రంగు అలముకుంది. అందుకు సంబందించిన వివరాలు... మండల వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 4 ఆశావర్కర్ల పోస్టుల భర్తీకి బుధవారం ఇంటర్వ్యూలు జరిగాయి. ఈ ఇంటర్వ్యూల అనంతరం మూడు పోస్టులకు సంబందించి పేర్లను మండల వైధ్యాదికారి రామక్రిష్ణ ప్రకటిస్తూ సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. ఇంతలోనే పాలేపల్లి కి చెందిన పోస్టు భర్తీ పెండింగ్‌ పెట్టడం వెనుక రాజకీయ కోణం ఉందని మొరసల పల్లి పంచాయతీ ఉపసర్పంచి ధనుంజయరెడ్డి మరికొంతమంది ఎంపిటీసిల భర్తలు హరి, నాగరాజు, వార్డు మెంబర్‌ చౌడప్ప, వైసిపి నాయకులు కులశేఖర్‌ రెడ్డి తదితరులు మండల వైధ్యాదికారి రామకృష్ణను నిలదీశారు. ఇదేమాదిరి మిగిలిన మూడు పోస్టుల భర్తీని కూడా వాయిదా వేయాలని ఆందోళన చేశారు. దీంతో మండల వైధ్యాదికారి రామక్రిష్ణ ప్రకటించిన పోస్ట్‌ల నియామకాలను వాయిదా వేస్తూ రేపటి రోజున ప్రకటిస్తామని వెల్లడించారు.