ప్రజాశక్తి - విజయవాడ అర్బన్
పల్నాడు జిల్లాకు చెందిన రమావత్ లీలావతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకో వాలని సిఐటియు తూర్పు నగర ప్రదాన కార్యదర్శి ఎన్.కోటి అన్నారు. పటమటలోని తూర్పు తహసిల్థారు కార్యా లయంలో సీనియర్ అసిస్టెంట్‌కు శనివారం వినతిపత్రం అందచేశారు. అనంతరం కోటి మాట్లాడుతూ సెప్టెంబరు 16వ తేదీన పల్నాడు జిల్లా చెంచుల కాలనీకి చెందిన రమావతు లీలావతి ఆశ వర్కర్ హత్యకు పాల్పడ్డారన్నారు. లీలావతి కుటుంబంలో ఆడపిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్లపై దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పద్మ, శివమ్మ, మీరాభి, లక్ష్మీదుర్గ పాల్గొన్నారు.










